లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ముస్లిం వ్యక్తిని కాల్చివేస్తానని, గోహత్య కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. (Cop Abuses, Threatens Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌పై చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 22న కైరానా కొత్వాలి ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వద్దకు మరో పోలీస్తో కలిసి కానిస్టేబుల్ మనీష్ కుమార్ వెళ్లాడు. సేల్స్‌మెన్ అఫ్తాబ్‌పై గతంలో వచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించాడు. ఈ సందర్భంగా అఫ్తాబ్‌ను పోలీస్ కానిస్టేబుల్ మనీష్ కుమార్ దూషించాడు. అతడి కాలుపై కాల్పులు జరుపుతానని, గోహత్య కేసులో ఇరికిస్తానని బెదిరించాడు.
కాగా, ఆ పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ మనీష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి ఆయనపై చర్యలు చేపట్టారు. సస్పెండ్ చేయడంతోపాటు అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్నారు.
“यो मेरे साथ जाएगा भोश्री का, तुझे करुंगा बंद जिस चीज में कहता हो, बहन के लौ..*# तेरे टांग में गोली मारकर गोकश में भेजूंगा”
उत्तर प्रदेश के जिला शामली की वीडियो है। आफताब को धमकाने वाला सिपाही मनीष कुमार लाइन हाजिर हुआ है। पुलिस आफताब को पकड़ने गई थी, उस पर कोई FIR है। pic.twitter.com/SOmVZw957E
— Sachin Gupta (@SachinGuptaUP) December 6, 2024