చండీగఢ్: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు చేపట్టిన ఉద్యమంపై వివాదాస్పద పోస్ట్ చేసిన బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ క్షమాపణలు తెలిపారు. రైతుల నిరసన సందర్భంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనాపై మహీందర్ కౌర్ అనే వృద్ధ మహిళా రైతు పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం బటిండా కోర్టులో హాజరైన కంగనా తాను ఆ మహిళా రైతుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.