శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 17, 2020 , 13:41:37

ఏవోబీలో మావోయిస్టుల ఘాతుకం

ఏవోబీలో మావోయిస్టుల ఘాతుకం

హైద‌రాబాద్ : ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఒడిశా మ‌ల్క‌న్‌గిరి జిల్లా మ‌తిలి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని దంగ్రిగూడ‌లో మావోలు రెచ్చిపోయారు. కాంట్రాక్ట‌ర్ సుకుమార్‌ను మావోయిస్టులు హ‌త్య చేశారు. అంత‌టితో ఆగ‌కుండా జేసీబీ, ట్రాక్ట‌ర్‌, జీపుకు నిప్పు పెట్టారు. స‌మాచారం అందుకున్న పోలీసులు దంగ్రిగూడ‌కు చేరుకున్నారు. ఆ ఏరియాలో పోలీసు బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్నాయి.