లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మసీదు నిర్మాణం వచ్చే ఏడాది మే నెల నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం నిధులను సేకరించేందుకు ఫిబ్రవరి నుంచి రాష్ర్టాలకు ఇన్ఛార్జిలను నియమించాలని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ధన్నీపూర్లో మసీదుకు స్థలాన్ని కేటాయించింది. ట్రస్టు చీఫ్ ట్రస్టీ జాఫర్ ఫరూఖీ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి మసీదు ఫైనల్ డిజైన్ ఖరారయ్యే అవకాశం ఉందని, వచ్చేమే నుంచి మసీదు నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. గతంలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదును నిర్మించాలనుకున్నామని, ఇప్పుడు దీనిని 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచామని తెలిపారు.