Sudershan Reddy | అది నా సొంత తీర్పు కాదు, సుప్రీంకోర్టు తీర్పు.. అమిత్ షా ఆ తీర్పును చదవాలి : జస్టిస్ సుదర్శన్ రెడ్డి
Sudershan Reddy | ప్రతిపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (Justice B Sudershan Reddy) నక్సలిజానికి అనుకూలంగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన విమర్శలపై ఆయన స్పందించారు.
Sudershan Reddy : ప్రతిపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (Justice B Sudershan Reddy) నక్సలిజానికి అనుకూలంగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. భారత రాజ్యాంగం (Indian Constitution) కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దేశ ప్రజాస్వామ్యం (Democracy) లో లోటు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. సల్వాజుడుంపై ఇచ్చినది తన సొంత తీర్పు కాదని, అది సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు అని చెప్పారు. విపక్షాలు తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
సల్వా జుడుం తీర్పుపై తాను కేంద్ర హోంమంత్రితో నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదని అన్నారు. గతంలో ఆ తీర్పును తానే రాశానని, కానీ అది నా సొంత తీర్పు కాదని, సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పారు. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నానని, ఒకవేళ ఆయన తీర్పు చదివి ఉంటే అలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. తాను చెప్పదలుచుకున్నది ఇంతేనని, ఈ చర్చను ఇంతటితో ఆపేద్దామని అన్నారు. కులగణనపై మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ కాదని, రెండు భావ జాలాల మధ్య పోటీ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమేనని, వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదని చెప్పారు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవని, దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడంలేదని అన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలకు సభ్యులు అప్పుడప్పుడు అంతరాయం కలిగించడం కూడా ఒక విధమైన నిరసన మాత్రమేనని, అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో అది అంతర్భాగంగా మారకూడదని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు లోటు ఆర్థిక వ్యవస్థ గురించి చర్చ జరిగేదని, ఇప్పుడు లోటు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నామని అన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశం కాదని తాను అనడంలేదని, ఇప్పటికీ మనది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమేనని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఒత్తిడికి గురవుతోందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
Read More >>
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.. నీట మునిగిన నగరం.. ఎక్కడంటే..!
లిక్కర్ స్కామ్ కేసు.. భూపేశ్ బఘేల్ కుమారుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
‘ఇప్పుడు రక్తం, క్రికెట్ కలిసి ప్రవహిస్తున్నాయా’.. ప్రధాని మోదీకి సంజయ్ రౌత్ ఘాటు లేఖ
భారత్-పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు.. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ మంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

