Priyanka Gandhi : తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ.. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రియాంక పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం దేశానికి ఒక సురక్ష కవచమని, ఆ రక్షణ కవచాన్ని బద్ధలు కొట్టేందుకు గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ‘రాజ్యాంగం ఒక సురక్షా కవచం. ఇది దేశ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. పౌరులకు న్యాయం చేస్తుంది. అందరినీ ఐక్యంగా ఉంచుతుంది. పౌరుల హక్కులను కాపాడుతుంది. ఇలాంటి రక్షా కవచాన్ని బద్ధలు కొట్టేందుకు పాలకులు గత పదేళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం బాధాకరం’ అని ప్రియాంకాగాంధీ అన్నారు.
‘రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా ఇస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని బద్ధలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటీకరణతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది’ అని ఆరోపించారు. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. కుల చేపట్టాలంటే గతంలో ఎందుకు చేయలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారని, ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి దేనికని ఆమె ప్రశ్నించారు.
ప్రతిదానికి ప్రభుత్వం నెహ్రూ హయాం గురించి మాట్లాడుతోందని, నెహ్రూ టైమ్లో అదెందుకు చేయలేదు, నెహ్రూ టైమ్లో ఇదెందుకు చేయలేదు అంటున్నారని, అధికారంలో లేకున్నా, బతికి లేకున్నా దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా..? అని ప్రియాంకాగాంధీ కేంద్ర సర్కారును నిలదీశారు. ‘ప్రతిదానికి నెహ్రూ పేరు ఎత్తేవాళ్లు.. దేశం కోసం వాళ్లు ఏం చేస్తున్నారో చెప్పగలరా..?’ అని ప్రశ్నించారు.
#WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, “The one, whose name you sometimes hesitate in speaking out, while speaking fluently at other times to use it to save yourself – he set up HAL, BHEL, SAIL, GAIL, ONGC, NTPC, Railways, IIT, IIM, Oil Refineries and… pic.twitter.com/5N0f0BwQBl
— ANI (@ANI) December 13, 2024