ముంబై: బీచ్‌లో ఈత కొడుతున్న ఇద్దరు పిల్లలు, అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆ ఇద్దరు పిల్లలను కాపాడాడు (Constable Saves Two Children). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం పదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఈత కోసం జూహు బీచ్‌లోకి దిగారు. అయితే అలల తాకిడికి వారిద్దరూ సముద్రం లోపలకు వెళ్లసాగారు. ఒడ్డుకు రాలేక, ఈత కొట్టలేక మునిగిపోసాగారు.
కాగా, శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే, ప్రమాదంలో ఉన్న ఆ పిల్లలను గమనించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దిగాడు. ఇద్దరు పిల్లలను రక్షించాడు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డు వద్ద ఉన్న తల్లిదండ్రులకు ఆ పిల్లలను అప్పగించాడు.
మరోవైపు ముంబై పోలీసులు ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జూహు బీచ్‌లో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను పోలీస్ కానిస్టేబుల్ విష్ణు ప్రాణాలకు తెగించి కాపాడినట్లు అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిల్లలను కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ చొరవ, ధైర్యసాహసాలను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
#WATCH | Santacruz Police station constable Vishnu Bhaurao Bele safely rescued two drowning children aged 7&10 from the sea at Juhu's Koliwada, Juhu Beach. pic.twitter.com/wnjVGJU6FP
— ANI (@ANI) June 24, 2023