Bombay High Court | ముంబై, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని పేర్కొన్నది.
మహారాష్ట్రలోని వార్దాకు చెందిన ఓ వ్యక్తి(24)పై మైనర్ అయిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు అతడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.