Rahul Gandhi | ఆగస్టు 20న కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక
Rahul Gandhi | ఆగస్టు 20న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. రాహుల్ ఆ బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్ణయించింది. ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో జీ-23 నాయకుల డిమాండ్ మేరకు ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని కూడా ఈ సమావేశం తీర్మాణించినట్లు తెలుస్తున్నది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చింతన్ బైఠక్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
జీ-23 గ్రూప్ నేతల నుంచి పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని డిమాండ్లు వచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ తమ పదవులకు రాజీనామా చేస్తారని వార్తలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వంటి వారు రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

