Priyanka Gandhi | ప్రభుత్వ ఏర్పాటులో అఖిలేశ్‌కు ఇబ్బందులు వస్తే, తాము మద్దతివ్వానికి రెడీగా ఉన్నామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. తాము మద్దతిస్తామని, ఇందులో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. అయితే యువకులు, మహిళల విషయంలో తాము రూపొందించి అజెండాను అమలు చేస్తే, అఖిలేశ్‌కు మద్దతివ్వడానికి తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అఖిలేశ్ కొద్ది దూరంలోనే ఉండిపోతే మీరు మద్దతిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా… యువకులు, మహిళల అజెండాను అమలు చేస్తానంటే మాత్రం తాము బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించారు.
తాము ఓ సిద్ధాంత ధృక్కోణంలోనే పోరాడుతున్నామని, మహిళా సాధికారతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ లక్ష్యం కోసం సమర్థవంతంగా పోరాటం చేస్తున్నామని, అధికారం దక్కుతుందా? లేదా? అన్నది మాత్రం చెప్పలేమన్నారు. అయితే యువకులు, మహిళల విషయంలోనే తాము పోరాడుతున్నామని, అయితే అధికారంలోకి రావడానికి మాత్రం ఇలా చేయడం లేదని ప్రియాంక ప్రకటించారు.