తిరువనంతపురం : కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ సోమవారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
సతీశన్తో పాటు మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్త క్యాబినెట్లో రమేష్ చెన్నితల, కే మురళీధరన్, సన్నీ జోసెఫ్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలకు చోటు దక్కింది. ఐయూఎంల్ నుంచి పీకే కున్హాలికుట్టి, కేఎం షాజీ, వీఈ అబ్దుల్ గఫూర్, ఎన్ షంసుద్దీన్, పీకే బషీర్ తొలిసారిగా మంత్రివర్గంలో అడుగు పెట్టారు.