న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీషర్ట్ ధరించి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని బీజేపీ ఎద్దేవా చేయగా కాంగ్రెస్ దీటైన కౌంటర్ ఇచ్చింది. బుర్బెర్రీ వైట్ టీ షర్ట్ ధరించిన రాహుల్ ఫోటోను “భారత్ దేఖో” క్యాప్షన్‌తో బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది.
అయితే బీజేపీ క్యాంపెయిన్‌కు కాంగ్రెస్ దీటుగా బదులిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రూ పది లక్షల విలువైన సూట్ ధరిస్తారని పేర్కొంది. రాహుల్ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటంతో బీజేపీలో గుబులు రేగిందని కాంగ్రెస్ ప్రతిస్పందించింది.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల మంట వంటి అంశాలపై మాట్లాడాలని, దుస్తులపై చర్చిద్దామంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రధాని మోదీ సూట్ ధర రూ పది లక్షలు కాగా ఆయన పెట్టుకునే కళ్లద్దాల ఖరీదు రూ 1.5 లక్షలు ఉంటుందని వాటి గురించి కూడా మాట్లాడాలని ట్వీట్ చేసింది.