Punjab Polls: సోనూసూద్ సోదరి ఎక్కన్నుంచి పోటీ చేస్తుందో తెలుసా..?
Malvika Sood: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అన్ని పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు

చండీగఢ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అన్ని పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు బరిలో నిలువబోయే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల పేర్లతో లిస్టును వెల్లడించింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చామ్‌కౌర్ సాహిబ్ నుంచి పోటీ చేయనున్నారు.
అదేవిధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. సీనియర్ నాయకుడు ప్రతాప్‌సింగ్ బజ్వా కాడియన్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ప్రముఖ పంజాబీ సింగర్ సిధూ మూసేవాలా మాన్సా స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నటుడు సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు.
కాగా, మొత్తం 117 నియోజకవర్గాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకేరోజు పోలింగ్ జరుగనున్నది. అదేరోజు యూపీలో రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి. పంజాబ్‌తోపాటు యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

