Bhupinder Hooda : అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా భారీ స్పందన కనిపించిందని, రాష్ట్రంలో బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము భారీ మెజారిటీ విజయం సాధించబోతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని హుడా చెప్పారు. అయితే హర్యానాలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కూటమి అనేది కేవలం జాతీయ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పాటైందని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలో దిగుతామని ఆయన చెప్పారు. కాగా, ఈ ఏడాది ఆఖరులో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది.