న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చింది బీఎస్పీ నేత మాయావతి(Mayawati). ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ వ్యవహరించిందని, దాని వల్లే ఢిల్లీలో బీజేపీ గెలిచినట్లు మాయావతి పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో.. ఇండియా కూటమికి బీఎస్పీ మద్దతు ఇవ్వలేదని, ఇది నిరుత్సాహానికి గురిచేసినట్లు ఇటీవల రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బెహన్జీ తమతో కలిసి పనిచేస్తే, బీజేపీ నెగ్గేది కాదన్నారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఇవాళ మాయావతి కౌంటర్ ఇచ్చారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె పోస్టు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ పనిచేసిందన్న విషయం అందరికీ తెలుసు అని, దాని వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితిలో ఉందని, కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదని ఆమె తెలిపారు. ఇతరుల పట్ల వేలు పెట్టి చూపే ముందు, తన స్వంత వ్యవహారాల గురించి సమీక్ష చేసుకోవాలని కాంగ్రెస్ నేతకు మాయావతి సూచన చేశారు.
ఢిల్లీలో ఏర్పడిన బీజేపీ సర్కారుకు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడం పెను సవాల్‌గా మారనున్నట్లు మాయావతి ఆరోపించారు.
1. कांग्रेस ने दिल्ली विधानसभा आमचुनाव में इस बार बीजेपी की B टीम बनकर चुनाव लड़ा, यह आम चर्चा है, जिसके कारण यहाँ बीजेपी सत्ता में आ गई है। वरना इस चुनाव में कांग्रेस का इतना बुरा हाल नहीं होता कि यह पार्टी अपने ज्यादातर उम्मीदवारों की जमानत भी न बचा पाए। 1/3
— Mayawati (@Mayawati) February 21, 2025