చెన్నై: ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కోసం వచ్చిన ఆ పార్టీ ఎంపీ హోటల్ లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. (Congress MP Trapped Inside Hotel Lift) ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గంటపాటు శ్రమించారు. లిఫ్ట్ డోర్ బ్రేక్ చేశారు. అందులో చిక్కుకున్న ఆ ఎంపీని రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం వడలూరులోని ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఎంపీ విష్ణు ప్రసాద్ అక్కడకు చేరుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్‌కు వెళ్లేందుకు కొందరితో కలిసి హోటల్లోని లిఫ్ట్ ఎక్కారు.
కాగా, సాంకేతిక సమస్య వల్ల ఆ లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ ఎంపీ విష్ణు ప్రసాద్‌తోపాటు మరికొందరు నేతలు అందులో చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ డోర్ తెరిచేందుకు గంట పాటు శ్రమించారు. చివరకు లిఫ్ట్ డోర్ బ్రేక్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ విష్ణు ప్రసాద్‌తోపాటు ఆరేడు మంది నేతలు ఆ లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
விடுதி லிப்டில் சிக்கிக்கொண்ட கடலூர் எம்.பி.. துரிதமாக செயல்பட்டு மீட்ட தீயணைப்பு வீரர்கள்..#Cuddalore | #CongressMP | #Hotel | #Lift | #Rescued | #PolimerNews pic.twitter.com/NFJsl7omib
— Polimer News (@polimernews) February 16, 2025