Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గన్‌మెన్, డ్రైవర్‌పై దాడి
Shashi Tharoor: ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌కు చెందిన డ్రైవర్, గన్‌మెన్‌పై దాడి జరిగింది. కేరళలోని వాండూర్‌లో ఉన్న తిరువల్లి వద్ద ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అయిదు మంది సభ్యుల బృందం ఆ అటాక్ చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒకర్ని అరెస్టు చేశారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) కాన్వాయ్‌కు చెందిన డ్రైవర్, గన్‌మెన్‌పై దాడి జరిగింది. కేరళలోని వాండూర్‌లో ఉన్న తిరువల్లి వద్ద ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అయిదు మంది సభ్యుల బృందం ఆ అటాక్ చేసింది. వాండూర్ పోలీసులు ఈ ఘటన పట్ల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎంపీ శశిథరూర్ గన్‌మెన్ కేపీ రతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాండూర్లోని చెల్లితోడ్ వద్ద రాత్రి 7.30కి ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత ఏపీ అనిల్‌కుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు థరూర్ వెళ్తున్నారు. అయితే చెల్లితోడ్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు బ్లాక్ అయ్యింది. నిందితులు రెండు వాహనాలతో .. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. అయితే ముందున్న వాహనాలను క్లియర్ చేసేందుకు ఎంపీ గన్‌మెన్ ప్రకటించారు. ఆ సమయంలో గలాట జరిగింది. గన్‌మెన్‌తో పాటు డ్రైవర్‌పై అటాక్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల్లో శుక్రవారం రాత్రి ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

