న్యూఢిల్లీ : గురుగ్రాం, నుహ్, సోహ్న ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండపై హరియాణ (Haryana Violence) ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సుర్జీవాలా బుధవారం విమర్శలు గుప్పించారు. అల్లర్లను కట్టడి చేయడంలో కాషాయ సర్కార్ విఫలమైందని, దురుద్దేశంతో వ్యవహరించిందని మండిపడ్డారు. గురుగ్రాం, నుహ్, సోహ్నలో హింసాత్మక ఘర్షణలు చెలరేగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. అసలైన కుట్రదారులు హరియాణ సర్కార్‌లోనే కొలువుతీరారని దుయ్యబట్టారు.
హరియాణలోని నుహ్ జిల్లాలో సోమవారం ఇరువర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఆరుగురు మరణించగా ఆపై అల్లర్లు ఇతర ప్రాంతాలకూ పాకాయి. మరోవైపు హరియాణ అల్లర్లపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా విచారం వ్యక్తం చేశారు. మతం కోసం కొట్లాడుకోవడం దేశానికి మంచిది కాదని హితవు పలికారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ, ప్రతి మతస్తుడూ కలిసికట్టుగా ఎదిగే అవకాశం ఉందని అన్నారు.
హరియాణలో జరుగుతున్న అలజడి గుండెలు పగలగొట్టేలా ఉందని, మతం కోసం మారణహోమం దేశానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అల్లర్లకు బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. విచారణలో అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని, ఘటనకు బాధ్యులను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.
Read More :
Bengaluru | బెంగళూరులో దారుణం.. ఆ వీడియోలతో మాజీ ప్రియురాలికి బెదిరింపులు