న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభణతో సాధారణ ప్రజలతోపాటు సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు కూడా మహమ్మారిబారిన పడుతున్నారు. తాజాగా రాజ్యసభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేకు కరోనా నిర్ధారణ అయింది.
ఖర్గేకు కరోనా లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఆయన ఇప్పటికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ డోసులు ఇప్పించుకున్నారని తెలిపారు. అయితే ప్రికాషన్ డోసు తీసుకోవడానికి ఆయనకు అర్హుడు కాదని వెల్లడించారు.
Leader of Opposition in Rajya Sabha, Mallikarjun Kharge tests positive for COVID-19
— ANI (@ANI) January 13, 2022
"He is asymptomatic & is under home isolation. He is fully vaccinated but was not yet eligible for his precaution dose," his office says in a statement pic.twitter.com/xm9fyYGhiq
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా కరోనా బారినపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. తనకు దగ్గు, జరం వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తాను పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేసుకున్నాని, అవి తనను రక్షిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని, ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.