Punjab Congress Crisis | పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం వేడెక్కింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత మంగళవారం పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సిద్ధూకు సంఘీభావంగా ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే మరికొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తన దృష్టికి రాలేదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా రద్దు చేసుకున్నారు. మరోవైపు సిద్ధూ తన మద్దతుదారులతో పాటియాలా హౌజ్‌లో భేటీ అయ్యారు. సిద్ధూతో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కలుసుకోనున్నారని సమాచారం. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు అమరిందర్ సింగ్ చెప్పారు. ఈ పరిణామాలను బట్టి పెద్ద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరో పార్టీలో చేరడానికి వీలుగా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధూ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు.
పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని సిద్దూను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అభ్యర్థించారు. పంజాబ్‌లో అవినీతికి వ్యతిరేకంగా సిద్ధూ నిలిచారని పేర్కొన్నారు. ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉండలేరన్నారు. సిద్ధూ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కోరారు.
పంజాబ్ మంత్రి రజియా సుల్తానా రాజీనామా తర్వాత.. పీసీసీ కోశాధికారి గుల్జార్ ఇందర్ చాహల్, ప్రధాన కార్యదర్శులు పర్గత్ సింగ్,యోగేందర్ ధింగ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. సిద్దూ రాజీనామా తర్వాత పార్టీ పదవికి రాజీనామా చేసిన నేత ధింగ్రా..