బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 15:29:34

ప్రియాంకవన్నీ అబద్దాలే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

 ప్రియాంకవన్నీ అబద్దాలే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

రాయ్‌బరేలి: కరోనా  వైరస్‌ నేపథ్యంలో కాలినడక వెళ్లున్న ఇండ్లకు వెళ్తున్న వలస కార్మికుల బాధలను సొమ్ము చేసుకోవాలనుకొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. వలస కార్మికుల కోసం ప్రభుత్వం మంచి పనులు చేస్తుండగా.. మనమెందుకు అడ్డం పడటం అంటూ వెక్కిరించారు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌. గాంధీ కుటుంబానికి పెట్టనికోటలా ఉన్న రాయ్‌బరేలి నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన అదితిసింగ్‌.. ప్రస్తుతం ప్రియాంక పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారు. 

వలస కార్మికులకు వేయి బస్సులు నడుపుతాం అంటూ ప్రియాంకగాంధీ పంపిన జాబితాలో సగం  నకిలీ రిజిస్ట్రేషన్‌ వాహనాలే ఉండగా.. మరికొన్ని కార్లు, జీపులు ఉన్నాయని అదితిసింగ్‌.. ప్రియాంకగాంధీపై విరుచుకుపడ్డారు. ఆ జాబితాలో 98 ఆటోలు కూడా ఉననాయని, ఈ ఏడాది ఇంతకన్నా పెద్ద జోక్‌ ఏదీలేదన్నారు. కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్న ఈ సమయంలో ఇలాంటి రాజకీయాలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు బస్సులను ఎందుకు పంపడంలేదన్నారు. గతంలో కోటాలో కాంగ్రెస్‌ చేసిన నిర్వాకాన్ని అప్పుడే మరిచిపోయారా? అంటూ అదితిసింగ్‌ నిలదీశారు.


logo