e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home అంతర్జాతీయం ట్రంప్‌ రిసార్టులో కరోనా కలకలం

ట్రంప్‌ రిసార్టులో కరోనా కలకలం

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్‌కు ఫ్లోరిడాలో మార్‌ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో రిసార్టును పాక్షికంగా మూసివేశారు. అయితే ఎంత మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందనే విషయాన్ని క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా వెల్లడించడంలేదు. ట్రంప్‌ జనవరిలో అధ్యక్షపదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ రిసార్టు అధికార నివాసంగా ఉన్నది.
‘రిసార్టులోని కొంతమంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో బీచ్‌ క్లబ్‌, లా కార్ట్‌ డైనింగ్‌ రూమ్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని’ క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. సీడీసీ నిబంధనలకు అనుగుణంగా బాన్‌క్వెట్, ఈవెంట్‌ సేవలు కొనసాగుతాయని తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement