ఖలీల్‌వాడి, ఏప్రిల్ 21: నగరంలోని ఐటీఐ కళాశాల గ్రౌండ్లో ఆదివారం ఉదయం వాకర్స్‌తో బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల చిట్‌చాట్ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు. వారితో కలిసి క్రీడల్లో పాల్గొన్న అనంతరం అల్పాహారం చేశారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.