రాంచీ, మే 7: జార్ఖండ్లో సోదాల్లో లభ్యమైన దాదాపు రూ.35 కోట్ల కేసులో రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, పీఏ ఇంట్లో పనిచేసే పనిమనిషి జహంగీర్ ఆలంను ఈడీ మంగళవారం అరెస్టు చేశారు. వివిధ సోదాల్లో రికవరీ చేసిన సొమ్ము రూ.36.75 కోట్లకు చేరిందని ఈడీ వర్గాలు తెలిపాయి.