న్యూఢిలీ: లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌లోని తన అధికార నివాస గృహాన్ని ఖాళీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను లోక్‌సభ సచివాలయం ఎంపీగా అనర్హుడిగా ప్రకటించింది. అధికార నివాసాన్ని ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలంటూ కోరడంతో రాహుల్ శుక్రవారం తన ఇంటిని ఖాళీ చేశారు.
ఆయన నివాసం నుంచి 2 ట్రక్కులలో సామానును 10, జన్‌పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలించారు. త్వరలో పూర్తిస్థాయిలో అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేయనున్నారు. రాహుల్‌కు పలు గృహాలు ఉన్నప్పటికీ తల్లి సోనియాతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.