న్యూఢిల్లీ : బహుళ పాస్‌పోర్టులు, విదేశాలలో ఆస్తులు కలిగి ఉన్నారంటూ తాను చేసిన ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా సోమవారం గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఉపశమనం కోసం అస్సాం హైకోర్టును ఆశ్రయించాలని ఖేరాను ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు జామీనును కూడా నిలిపివేసిన సుప్రీంకోర్టు గౌహతి హైకోర్టు ఈ విషయాన్ని మునుపటి అభిప్రాయాల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్రంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది.