బుధవారం 27 జనవరి 2021
National - Dec 21, 2020 , 16:30:11

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మోతీలాల్ వోరా క‌న్నుమూత‌

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మోతీలాల్ వోరా క‌న్నుమూత‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మోతీలాల్ వోరా(93) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మోతీలాల్ వోరా చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. వోరా మృతిప‌ట్ల కాంగ్రెస్ నాయ‌కులు సంతాపం తెలిపారు.

ప్ర‌ధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మోతీలాల్ వోరా మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. మోతీలాల్ వోరా నిజ‌మైన కాంగ్రెస్‌వాది అని రాహుల్ పేర్కొన్నారు. ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో విస్తార‌మైన పాల‌నా అనుభ‌వం ఉన్న నాయ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని మోదీ అన్నారు. వోరా కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు మోదీ. 


logo