పార్టీ సైద్ధాంతిక విషయాల్లో భారీ మార్పులు చేస్తాం : కాంగ్రెస్ కీలక ప్రకటన
రాజస్థాన్ వేదికగా జరగబోయే పార్టీ చింతన శిబిరం ఆధారంగా పార్టీలో పెద్ద మార్పులు రాబోతున్నాయని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే పార్టీ సిద్ధాంత విషయాల్లో కూడా భారీ మార్పులే రానున్నాయని ప్రకటించారు. ఈ మార్పులు పెద్ద గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని అన్నారు.
పార్టీ సైద్ధాంతిక ఆలోచనల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అయితే ఇదే సరైన సమయమని తాము భావిస్తున్నట్లు వేణుగోపాల్ స్పష్టం చేశారు. చింతన శిబిర్లో ఇదే ప్రధాన కేంద్రంగా చర్చలు జరుగుతాయని కూడా పేర్కొన్నారు.
ఇక.. శిబిరానికి సంబంధించి మొత్తం 6 గ్రూపులను తయారు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఈ 6 బృందాలు కూడా వివిధ విషయాలపై లోతుగా చర్చలు, అధ్యయనాలు చేస్తుందని తెలిపారు. ఇక ముందు ఏం చేయాలి? పార్టీ మౌలిక విషయాల్లో ఎలా మార్పులు చేయాలి? ఎన్నికల వ్యూహంతో సహా పలు విషయాలపై ఈ బృందాలు చర్చిస్తాయని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

