న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య ఇటీవల సంఘర్షణ కొనసాగుతుండగా, మోదీ ప్రభుత్వం హఠాత్తుగా కాల్పులను ఎందుకు ఆపింది, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం, ఆయన ప్రకటనలు తదితర అంశాలపై విపక్ష కాంగ్రెస్ పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో దీనిపై ప్రశ్నించడానికి ఆ పార్టీ ఈ నెల 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లో ‘జైహింద్ సభలు’ నిర్వహించాలని నిర్ణయించింది.