JK Elections : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది. అభ్యర్ధుల ఖరారు కోసం సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఆగస్ట్ 27న 9 మంది అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రకటించగా మిగిలిన స్ధానాలపై వడపోతను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఈ భేటీలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీఈసీ భేటీ అనంతరం పార్టీ నేత టీఎస్ సింగ్‌దేవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈరోజు భేటీ 29 అసెంబ్లీ స్ధానాలపై చర్చించామని, త్వరలో జాబితా విడుదలవుతుందని చెప్పారు. జమ్ము కశ్మీర్లో అన్ని అసెంబ్లీ స్ధానాలకూ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేశామని కాంగ్రెస్ నేత అంబికా సోనీ వెల్లడించారు.
కాగా కాంగ్రెస్ ఇప్పటికే 9 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పార్టీ నేత గులాం అహ్మద్ మిర్ దూరు స్ధానం నుంచి పోటీ చేయనుండగా, వికార్ రసూల్ వనీ బనిహాల్ నుంచి బరిలో దిగనున్నారు. పిర్జాద మహ్మద్ సయ్యద్ అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. షేక్ రియాజ్ దోడా నుంచి బరిలో దిగనున్నారు. ట్రాల్ నుంచి సురీందర్ సింగ్ చన్నీని పార్టీ బరిలో నిలిపింది. ఇక అమానుల్లా మంతూ దేవ్సర్ నుంచి, షేక్ జఫరుల్లా ఇందర్వల్ నుంచి, నదీం షరీఫ్ భదర్వ నుంచి, దోడా వెస్ట్ నుంచి ప్రదీప్ కుమార్ భగత్ పోటీ చేస్తారు.
Read More :
Pawan Kalyan Birthday | తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి