న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఆరేండ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. ఏప్రిల్ 24న పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించే కార్యక్రమంలో లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ..
రాహుల్ గాంధీకి, ఆయన బావమరిది రాబర్ట్ వాద్రాకు పరిపక్వత లేకపోవడం వల్ల దేశం తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని విమర్శించడంతోపాటు వారి అపరిపక్వతను కాంగ్రెస్ పార్టీ ఇంకెంతకాలం భరించాలని ప్రశ్నించారు.