(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లో మహువా సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి ఓం ప్రకాశ్ హుడ్లా ఓటరుకు డబ్బులిస్తున్న ఓ వీడియో వైరల్గా మారింది. ఓంప్రకాశ్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా నీళ్ల బిందెతో వెళుతున్న అమ్మాయి ఆయనకు కనిపించింది. వెంటనే ఆమెకు డబ్బులిచ్చి, ఓటు వేయాలంటూ కాళ్లకు దండం పెట్టి అభ్యర్థించాడు. ఈ ఘటనపై ఈసీ దర్యాప్తు చేయనుంది.