Ranbir Kapoor-Alia Bhatt | బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, కథానాయిక ఆలియా భట్ త్వరలో ఒక్కటి కాబోతున్నారు. తమ మధ్య అనుబంధాన్ని ఎల్లవేళలా రహస్యంగా ఉంచారు. ఈ నెల రెండోవారం రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులు కాబోతున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు హాజరు కానున్నారు. ముంబై నగరంలోని చెంబూర్ ప్రాంతంలో గల ఆర్కే హౌస్‌లో వివాహం జరుగనున్నదని సమాచారం. ఇంతకుముందు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ వివాహం చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ, వారి కుటుంబ సభ్యులు మాత్రం ముంబైలోనే వివాహం జరుగాలని నిర్ణయించినట్లు సూచించారని వినికిడి.
రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల సెలబ్రిటీ డిజైనర్ మానిష్ మల్హోత్రా స్టోర్‌కెళ్లి వచ్చారు. తర్వాత మనీష్ మల్హోత్రా.. కపూర్ ఇంటికెళ్లారు. తాజాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తాజాగా తాము నటిస్తున్న సినిమాల షూటింగ్ తేదీల షెడ్యూల్ కోసం తమ ప్రొడ్యూసర్లను అడిగి తెలుసుకున్నారు. తమ వివాహం కోసం షూటింగ్ షెడ్యూల్లో ఫ్రీ డేట్స్ గురించి ఆరా తీశారని సమాచారం.
ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆలియాభట్ నటించారు. సినిమా థియేటర్లలోకి ఎంటరైన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డు బద్దలు చేస్తున్నది. ఇక రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్న బ్రహ్మస్త్ర సినిమా వచ్చే సెప్టెంబర్ 9న విడుదల కానున్నది.