న్యూఢిల్లీ: మంత్రి అయినంత మాత్రాన బెయిల్ మంజూరు చేసే విషయాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారించింది.
‘బెయిల్‌ను తిరస్కరించడానికి నిందితుడి అధికారిక హోదా కారణం కాకూడదు. ఇదే సమయంలో బెయిల్ మంజూరు చేసేందుకు హోదాను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవడమూ కుదరదు. న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించే క్రమంలో అధికారిక హోదాలు, స్థాయికి సంబంధం ఉండదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.