న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని పలు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఏకంగా 67 మందికి టాప్ ర్యాంకు వచ్చిందని, వీరిలో ఆరుగురు ఒకే ఎగ్జామ్ సెంటర్కు చెందిన వారని వారు ఆరోపిస్తున్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఆరోపణలను ఖండించింది.
ఎన్సీఈఆర్టీ టెక్స్బుక్స్లో చేసిన మార్పులు, ఎగ్జామినేషన్ సెంటర్లో పరీక్ష సమయాన్ని కోల్పోయినందుకు గ్రేస్ మార్కులు కేటాయించడం వల్ల విద్యార్థులు స్కోర్ పెరిగిందని పేర్కొన్నది. బుధవారం సాయంత్రం నీట్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 67 మందికి టాప్ ర్యాంకు వచ్చింది. వీరిలో హర్యానాలో ఒకే సెంటర్కు చెందిన ఆరుగురు ఉన్నారు.