MP Suresh Gopi | త్రిస్సూర్: కేంద్ర మంత్రి, త్రిస్సూర్ ఎంపీ సురేశ్ గోపి తన నియోజక వర్గం నుంచి అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ అనుబంధ కేరళ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోకుల్ గురువాయూర్ త్రిస్సూర్ తూర్పు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఛత్తీస్గఢ్లో మలయాళీ కైస్త్రవ సన్యాసినులు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని గోకుల్ ఆరోపించారు.
ఆ కేసును ఎంపీ కల్పితమైనదిగా అభివర్ణించారని ఆయన తెలిపారు. ‘రెండు నెలల నుంచి ఆయన కనిపించడం లేదు. త్రిస్సూర్ మేయర్, రెవెన్యూ మంత్రి కూడా ఆయనను కలవలేకపోతున్నారు’ అని గోకుల్ తెలిపారు. దీని గురించి కేంద్ర మంత్రి ఆఫీస్ సిబ్బందిని అడిగితే ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో ధ్రువీకరించడం లేదని.. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు సైతం కేంద్ర మంత్రి కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గోకుల్ ఆరోపించారు.