హైదరాబాద్ : ఇటీవల ఐదు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నో పార్టీలు పురుడు పోసుకొని రాజకీయాల్లో తమ అస్థిత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ క్రమంలో కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోవడంతో దేశంలో కమ్యూనిస్టుల పాలనకు తెరపడినట్లయింది. 1957లోఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది.
అప్పటి నుంచి కేరళ, పశ్చిమ బెంగల్, త్రిపుర ఇలా 49 ఏండ్ల ఏండ్లలో ఏదో ఒక చోట గెలుస్తూ అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. అయితే, 2026 ఏప్రిల్లో కేరళతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. కేరళలో మొన్నటి వరకు సీపీఎం పార్టీ నాయకుడు పినరయి విజయన్ నాయకత్వంలో ఆ పార్టీ వరుసగా రెండు సార్లు గెలిచి పాలన సాగిస్తున్నది. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో కేరళలలో అధికారంలోకి వచ్చిన వామపక్షాలు కేరళలలో ఓటమితోనే తన ప్రస్థానాన్ని ముగించినట్లయింది.