LPG Price Hike | మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఐదు నెలల్లోనే డబుల్ రేట్!
LPG Price Hike | కేంద్రం మరోసారి షాకిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచాయి.
LPG Price Hike | కేంద్రం మరోసారి షాకిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.42 రూపాయల వరకు పెంచినట్లుగా చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3113.50కు చేరింది. పెరిగిన ధరలు జూన్ 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి.
అదే కోల్‌కతాలో ఈ పెంపు రూ.53.50గా ఉంది. అక్కడ గ్యాస్ సిలిండర్ ధర రూ.3255.50కు చేరుకుంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.3294కు చేరింది. ఇక చెన్నైలో రూ.3232, పట్నాలో 3322గా ఉంది.
అలాగే ఐదు కేజీలో ఫ్రీట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.11 చొప్పున పెంచారు. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.821.50 కు చేరుకుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.913గానే ఉంది.
ఐదు నెలల్లో డబుల్
ఈ ఏడాది ప్రారంభం నుంచే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1691.50గా ఉండగా.. ప్రస్తుతం అది 3113.50కు చేరింది. అంటే కేవలం ఐదు నెలల్లోనే ధర దాదాపు రెట్టింపయ్యింది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఫిబ్రవరిలో రూ.49 పెంచారు. అనంతరం మార్చిలో రూ.115 పెంచగా.. ఏప్రిల్‌లో ఒకేసారి రూ.993 పెంచి వ్యాపారస్తులకు భారీ షాకిచ్చారు. మే నెలలో కూడా అదే కొనసాగగా.. ఇప్పుడు జూన్‌లో మరోసారి రూ.42 పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

