వాణిజ్య సిలిండర్పై రూ. 183.50 తగ్గింపు
మురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 183.50కి తగ్గించాయి. గత నెలలో రూ. 3,113కి చేరిన కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,930గా ఉంది.
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 183.50కి తగ్గించాయి. గత నెలలో రూ. 3,113కి చేరిన కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,930గా ఉంది. అలాగే ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(ఎఫ్టీఎల్) సిలిండర్ ధర రూ. 13 తగ్గి, రూ. 808.50కి చేరింది.
గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అది రూ. 942గానే కొనసాగుతున్నది. ఇకపై ఏటీఎఫ్ ధరల పథకం కింద విమానయాన సంస్థలు మూడేండ్ల పాటు స్థిరంగా లీటరుకు రూ. 115 చొప్పున జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. నయారా ఎనర్జీ సంస్థ పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

