న్యూఢిల్లీ: దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై (Gas cylinder) భారీగా వడ్డించాయి. నెలవారీ సమీక్షలో భాగంగా ఒకేసారి రూ.104 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563.5కి పెరిగింది. గతంలో ఇది రూ.2460గా ఉన్నది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.102.5లు పెరగడంతో రూ.2355.5కు చేరింది. ముంబైలో రూ.2329.50, కోల్‌కతాలో రూ.2477.50, చెన్నైలో రూ.2508కి పెరిగింది.
గత నెల 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.268.5 వడ్డించాయి. తాజాగా మరో రూ.104 పెరగడంతో రెండు నెలల్లోనే రూ.372 ప్రజలపై భారం మోపాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగకపోవడం సంతోషించదగిన విషయమే.