న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ వాణిజ్య సిలిండర్ ధర రూ.14.5 తగ్గింది.
మరోవైపు విమానయాన ఇంధనం(ఏటీఎఫ్) ధర కిలో లీటర్కు 5.6 శాతం (రూ.5,078.25) పెరిగింది. దీంతో దేశ రాజధానిలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.95,533.72కు చేరుకుంది. గృహావసరాలకు వాడే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.