వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెంపు
కమర్షియల్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.102.5 చొప్పున ఆదివారం చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,562.5కు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది.
- 19 కిలోల బుడ్డిపై రూ.102.5 వాత
- రెండు నెలల్లో ఏకంగా రూ.457 పెంపు
- విమానాల ఇంధనం ధర ఇంకా పైపైకి
న్యూఢిల్లీ, మే 1: కమర్షియల్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.102.5 చొప్పున ఆదివారం చమురు కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,562.5కు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. కమర్షియల్ సిలిండర్లపై రెండు నెలల్లో మొత్తంగా రూ.457 పెంచారు. మరోవైపు, ఉజ్వల దివస్ సందర్భంగా చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆదివారం 5వేల ఎల్పీజీ పంచాయత్‌లను నిర్వహించాయి. వాణిజ్య సిలిండర్‌తో పాటు జెట్ ఇంధన(ఏటీఎఫ్) ధరలు కూడా కిలో లీటర్‌కు రూ.3,649.13 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఏటీఎఫ్ కిలో లీటర్ రేటు రూ.1,16,851.46గా ఉంది.

సామాన్యుడి వేదన అర్థం చేసుకోరా?
హైదరాబాద్, మే 1, (నమస్తే తెలంగాణ): కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సామాన్యుడి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలు దుకాణాలు, హోటళ్లు అన్నింటి మూసేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలని కేంద్రం భావిస్తున్నదా’ అని ఘాటుగా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాలు సామాన్యుడి పట్ల ఉదాసీన వైఖరిని తెలియజేస్తున్నాయని విమర్శించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

