న్యూఢిల్లీ: దివ్యాంగులను ఎగతాళి చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఐదుగురు కమెడియన్లను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో దివ్యాంగులపై సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలీ ఠక్కర్, నిశాంత్ జగదీశ్ తన్వర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
వీరిపై జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. దివ్యాంగుల హక్కులపై అవగాహన కల్పించేందుకు తమ వేదికలను ఏ విధంగా ఉపయోగించగలరో అఫిడవిట్‌ను ఇవ్వాలని ఆదేశించింది.