లక్నో: ఇద్దరు విద్యార్థినుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. మరి కొందరు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Lady students Fight) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం జీఎన్ఐఎంఎస్ కాలేజ్ క్యాంపస్‌లో ఇద్దరు లేడీ స్టూడెంట్స్ మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒక యువతి చెంపపై మరో యువతి కొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జట్టు పట్టుకుని తిరిగి కొట్టింది. ఇది చూసి వారిని విడిపించేందుకు అక్కడున్న కొందరు విద్యార్థినులు ప్రయత్నించారు. అయితే వారి మధ్య వాగ్వాదం, ఫైట్‌కు కారణం ఏమిటో అన్నది తెలియలేదు.
కాగా, ఒక స్టూడెంట్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. గొడవల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువేమీ కాదని ఒకరు వ్యాఖ్యానించారు. కాలేజీల్లో ఏం జరుగుతోంది? అని మరొకరు ప్రశ్నించారు. కాలేజీల్లో బాలీవుడ్ డ్రామా జరుగుతోందని ఒకరు విమర్శించారు.
अब मारपीट में लड़किया भी नहीं है लड़को से कम, दो छात्राओं के बीच जमकर हुयी मारपीट।
ग्रेटर नोएडा के GNIMS कॉलेज का बताया जा रहा है वायरल वीडियो। pic.twitter.com/1S8MACmF6o— Greater Noida West (@GreaterNoidaW) December 21, 2024