అడవి ఏనుగుల దాడిలో 50కి పైగా ఇండ్లు ధ్వంసం
Elephant attack | అడవుల పరిసర గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు ప్రవేశించడం సర్వసాధారణమైంది. చిరుతలు, ఎలుగులు, పెద్ద పులులు, ఏనుగులు ఇలా
కోయింబత్తూర్: అడవుల పరిసర గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు ప్రవేశించడం సర్వసాధారణమైంది. చిరుతలు, ఎలుగులు, పెద్ద పులులు, ఏనుగులు ఇలా ఎప్పుడూ ఏవో జంతువులు పరిసర గ్రామాల్లో జనవాసాల్లో దూరుతున్నాయి. పెద్ద పులులు, చిరుతల దాడిలో ఇప్పటికే చాలా సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడప్పుడు ఎలుగులు దాడులు చేసి ప్రజల ప్రాణాలు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఏనుగులు గ్రామాల్లో చొరబడి ప్రజల ప్రాణాలు తీయడం, పంటలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ జిల్లాలోని కడలూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ గ్రామంలో చొరబడింది.
వచ్చీరావడంతోనే ఏనుగులు జనావాసాలపై దాడి చేయడంతో 50కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. డప్పులు కొడుతూ, బాంబులు కాలుస్తూ స్థానికులు ఆ ఏనుగుల మందను వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. చివరి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఏనుగుల మందను అడవి వైపు మళ్లించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

