Coffee | న్యూఢిల్లీ : కాఫీ తాగడం ద్వారా మన ఆయుర్దాయానికి అదనంగా రెండేళ్లు జోడించవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘ఏజింగ్ రిసెర్చ్ రివ్యూస్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాఫీ తాగడం వల్ల సగటున 1.8 సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంచుకోవచ్చు.
గతంతో పోలిస్తే ప్రపంచ జనాభా వేగంగా వృద్ధాప్యంలోకి జారుకుంటున్నదని, కాబట్టి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని అన్వేషించడం అవసరమని పోర్చుగల్లోని కొయింబ్రా యూనివర్సిటీ లీడ్ రిసెర్చర్ రోడ్రిగో చున్హా పేర్కొన్నారు. ఈ విషయంలో కాఫీ ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.