లక్నో, జూన్ 12: పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో లక్నోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు నిరసనకారులు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్, రెవెన్యూ, పరిపాలన వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు సుమారు ఆరువేల మంది లక్నోలోని ఈకో గార్డెన్‌కు ఉదయమే చేరుకున్నారు.
ఈ నిరసనలో దాదాపు 40 నిమిషాలపాటు పాల్గొన్న అభిజీత్ దీప్కే ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. లేఖ్పాల్, యూపీఎస్‌ఐ, నీట్ లేదా సీబీఎస్ఈ వంటి పరీక్షల పేపర్ల లీకేజీకి బాధ్యులైన వారందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.