ముంబయి, జనవరి 6: ముంబయి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో శుక్రవారం సుమారు రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి సౌతాఫ్రికా నుంచి కెన్యా మీదుగా ముంబయికి 4.47 కిలోల హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్లలో దాచి తీసుకురాగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ.31.29 కోట్లు ఉంటుంది. ఇక, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన మరో వ్యక్తి తన కుర్తా గుండీల్లో 1.596 కిలోల కొకైన్‌ను తీసుకువస్తూ దొరికిపోయాడు. దీని విలువ రూ.15.96 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.