పోర్బందర్: భారత తీర రక్షక దళ(ఐసీజీ) హెలికాప్టర్ ఆదివారం రన్‌వేపై దిగుతున్నప్పుడు కుప్పకూలి ఆహుతైంది. ఈ ఘటనలో అందులోని ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. పోర్బందర్ ఎస్పీ కథనం ప్రకారం… అధునాతన తేలికపాటి హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) గుజరాత్‌లోని పోర్బందర్ తీర రక్షక విమానాశ్రయం రన్‌వేపై దిగాలని వస్తుండగా రన్ వే సమీపంలో కూలిపోయింది.
వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపు చేసి అందులోని ముగ్గురు సిబ్బందిని దవాఖానకు తరలించారు. ‘దవాఖానకు చేరగానే ఇద్దరు మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు’ అని కమలా బాగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.