న్యూఢిల్లీ, మే 6: సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు, 24 గంటల వార్తా ప్రసారాలకు ఆద్యుడిగా నిలిచిన ‘టెడ్ టర్నర్’ (87) బుధవారం కన్నుమూశారు. మీడియా మొఘల్‌గా పేరు ప్రఖ్యాతలు అందుకున్న టెడ్ టర్నర్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బుధవారం ఫ్లోరిడా రాష్ట్రం టల్లహస్సీలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్టు టర్నర్ ఎంటర్ప్రైజెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1980లో ఆయన స్థాపించిన సీఎన్ఎన్, 24 గంటల వార్తా ఛానల్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. వార్తల ప్రసారంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తిగా టెడ్ టర్నర్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన మృతికి అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.